Translate

Saturday, 15 October 2016

బార్డర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన ఆర్మీ…!!!!

శుక్రవారం రాత్రి జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసినట్టే ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి… కాశ్మీర్‌ లోయ వ్యాప్తంగానూ భద్రత కట్టుదిట్టం చేశారు. హంద్వారా, పాంపోర్‌ దాడులు విఫలమవడం.., ఈడీఐ భవనంపై దాడితో భారత్‌కు జరిగిన నష్టం పెద్దగా లేకపోవడంతో ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. సున్నిమైన ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదులు జవాన్‌ కాన్వాయ్‌లను లక్ష్యంగా పెట్టుకున్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
శుక్రవారం రాత్రి శ్రీనగర్‌ శివార్లలోని జకూరా ప్రాంతంలో జవాన్ల కాన్వాయ్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడిలో మృతి చెందిన జవాను ఘనశ్యామ్‌ గుజ్జార్‌కు ఆర్మీ లాంఛనాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. విజయ్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని దాసా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసి పరారయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మరో వైపు పాక్‌ పత్రికలు అసలు సర్జికల్‌ దాడులే జరగలేదనే విధంగా వార్తలు వండి వార్చుతున్నాయి. పాక్‌ విదేశాంగ కార్యదర్శి జర్మనీ రాయబారితో సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరగలేదని చెప్పినట్టుగా ద న్యూస్‌ ఇంటర్నేషనల్‌ అనే పత్రికలో కథనం వచ్చింది. ఆ వార్త నిజం కాదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఖండించారు.

1 comment: