తొలగించిన రేషన్ కార్డులను పునరుద్ధరించాలంటూ ఆందోళనకు దిగింది టీ టీడీపీ. బేగంపేటలో ఉన్న చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ముట్టడించారు గ్రేటర్ టీడీపీ నాయకులు. ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్డులు పునరుద్ధరించకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని, అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు నేతలు. రేషన్ కార్డులు తొలగించి పేదల కడుపుకొట్టడం సరికాదన్నారు.

No comments:
Post a Comment