Translate

Thursday, 20 October 2016

బాణాసంచా గోదాంలో భారీ ప్రమాదం... 8మంది మృతి, సుమారు 10మందికి గాయాలు....


దీపావళి బాణాసంచాల తయారీకి పేరెన్నికగన్న ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి... ఈ ప్రాంతంలో ఎపుడూ ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది... అలాంటి ప్రమాదాల్లోనే చాలా మంది అశువులు బాసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి... అలాంటిదే ఇపుడు మరో అగ్ని ప్రమాదం జరిగింది... బాణా సంచా గోదామములో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు... వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో గోదాంలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

భారీ మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి... అయితే... దీపావళి సమీపిస్తుండడంతో భారీ మొత్తంలో టపాకాయలు తయారు చేసి నిల్వ ఉంచారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కాలి బూడిదైపోయాయి.



No comments:

Post a Comment