సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఫామ్‌హౌజ్ వదిలి… పంట క్షేత్రాలకు వస్తే… రైతుల సమస్యలు ప్రత్యక్షంగా అర్థమవుతాయని సీఎం కేసీఆర్‌కు సూచించారు. నకిలీ విత్తనాల అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే… ప్రతిపక్షాలపైనే అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.
అన్నదాత ఆక్రందన పేరిట జమలాపురం నుంచి ఖమ్మం వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు 70 కిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. బ్రాందీవాదులెవరో, గాంధీవాదులెవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి పోచారం చేసిన కామెంట్లపై మండిపడ్డారు భట్టి విక్రమార్క… బ్రాందీవాదులెవరో ప్రజలందరికీ తెలుసని… మత్తు వదిలించుకుని వస్తేనే రైతుల కష్టాలేంటో తెలుస్తాయని పేర్కొన్నారు.

No comments:
Post a Comment