Translate

Thursday, 20 October 2016

బాణాసంచా గోదాంలో భారీ ప్రమాదం... 8మంది మృతి, సుమారు 10మందికి గాయాలు....


దీపావళి బాణాసంచాల తయారీకి పేరెన్నికగన్న ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి... ఈ ప్రాంతంలో ఎపుడూ ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది... అలాంటి ప్రమాదాల్లోనే చాలా మంది అశువులు బాసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి... అలాంటిదే ఇపుడు మరో అగ్ని ప్రమాదం జరిగింది... బాణా సంచా గోదామములో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు... వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో గోదాంలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

భారీ మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి... అయితే... దీపావళి సమీపిస్తుండడంతో భారీ మొత్తంలో టపాకాయలు తయారు చేసి నిల్వ ఉంచారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కాలి బూడిదైపోయాయి.



Wednesday, 19 October 2016

నారా వారి ఆస్తులు ఇవేనట...!

గుంటూరులో తన కుటుంబ అస్తులు వివరాలు ప్రకటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌... వరుసగా ఎనిమిదో ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేష్‌... దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ఆస్తులు ప్రకటించడం లేదన్నారు. చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.3కోట్ల 73లక్షలు ఉన్నట్లు చెప్పారు లోకేష్... చంద్రబాబు నికర ఆస్తులు రూ.6కోట్ల 7లక్షలు కాగా, చంద్రబాబుకు జూబ్లీహిల్స్‌లో 3.68 కోట్ల విలువైన ఇల్లు... రూ. లక్షా 52వేల విలువైన పాత అంబాసిడర్ కారు... చంద్రబాబు ఖాతాలో రూ.3ల‌క్షల 59వేల న‌గ‌దు  ఉండగా... చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం రూ. 3కోట్ల 6లక్షలు ఉన్నట్లు చెప్పారు.

నారా భువ‌నేశ్వరి పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాలు... పంజాగుట్టలో 73.33కోట్ల విలువైన భవనం... చెన్నైలో 1.86 లక్షల విలువైన గోడౌన్, హైదరాబాద్ మదీనగూడలో 73.8 లక్షల విలువైన 5ఎకరాల వ్యవసాయ భూమి. హెరిటేజ్ ఫుడ్స్‌లో 19.95 కోట్ల విలువైన పెట్టుబడులు,

వివిధ కంపెనీలలో భువ‌నేశ్వరి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3.28 కోట్లుగా వెల్లడించారు... భువ‌నేశ్వరి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్షలు కాగా..భువనేశ్వరి ఆభరణాల విలువ రూ.కోటి 27 ల‌క్షలుగా ప్రకటించారు. భువనేశ్వరి పేరిట ఓ ఆడీ కారు ఉన్నట్లు దాని విలువ రూ.91 ల‌క్షలు... భువ‌నేశ్వరి పేరిట ఉన్న మొత్తం రూ.38కోట్ల 66ల‌క్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు లోకేష్... భువనేశ్వరి పేరిట రూ.13 కోట్ల అప్పుఉన్నట్లు తెలిపిన లోకేష్‌... నిక‌ర ఆస్తులు రూ24 కోట్ల 84 ల‌క్షలుగా చెప్పారు.

నారా లోకేశ్‌ ఆస్తుల వివ‌రాలు... నారాలోకేష్ మొత్తం ఆస్తులు 14.50కోట్లు కాగా... అప్పులు 6.35 కోట్లు ఉన్నట్లు తెలిపారు, లోకేష్‌ నికర ఆస్తుల విలువ 8.15కోట్లు చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ.2 కోట్ల 52 ల‌క్షలు... ఇత‌ర కంపెనీల్లోని వాటాల విలువ రూ.కోటి 64 ల‌క్షలగా చెప్పిన లోకేష్‌... నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్షలుగా వెల్లడించారు.

నారా బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.12 కోట్ల 75 ల‌క్షలుగా ప్రకటించారు... రూ.42 ల‌క్షల అప్పులు  ఉండగా బ్రహ్మణి నిఖర ఆస్తుల విలువ రూ.12 కోట్ల 33ల‌క్షలుగా చెప్పారు లోకేష్‌... మాదాపూర్‌లో బ్రాహ్మణి పేరిట రూ.17 ల‌క్షల విలువైన భూమి ఉన్నట్లు తెలిపారు... జూబ్లిహిల్స్‌లో ఇంటి విలువ రూ.3 కోట్ల 50ల‌క్షలు... హైద‌రాబాద్‌లో రూ.48 ల‌క్షలు విలువైన స్థలం... మ‌ణికొండ‌లో రూ.కోటి 23 ల‌క్షల విలువైన స్థలం ఉన్నట్లు వెల్లడించారు... హెరిటేజ్ ఫుడ్స్‌లో బ్రహ్మణి వాటాల విలువ రూ.78 ల‌క్షలు ఉన్నట్లు వెల్లడించారు.. అయితే బ్రహ్మణి ఆభరణాల విలువ రూ.15 ల‌క్షలు కాగా, తన పీఎఫ్ ఖాతా విలువ రూ.19ల‌క్షలుగా వెల్లడించారు లోకేష్‌... ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.25 ల‌క్షలు

లోకేష్‌ తన కొడుకు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ప్రకటించారు.... దేవాన్ష్ పేరిట జూబ్లిహిల్స్‌లోని రూ. 9 కోట్ల 17 ల‌క్షల విలువైన ఇంటి స్థలం.. రూ.2 కోట్ల 4ల‌క్షల పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు... దేవాన్ష్ ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.2 ల‌క్షల 31 వేలు కాగా, దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం రూ.11 కోట్ల 32 ల‌క్షలు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ

http://14.139.82.55/exambranch/TimeTables10162301.pdf

ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు... 15, 17, 18 తేదీలలో జరగవలసినవి వాయిదా పడిన విషం విధితమే... ఆ వాయిదా పడిన పరీక్షలు 15న జరగాల్సిన పరీక్ష నవంబర్ 12న, నవంబర్ 17న జరగాల్సింది 19న, 18న జరగాల్సింది నవంబర్ 21న జరగనున్నాయి దయచేసి ఉస్మానియా పరిధిలో గల కళాశాలల విద్యార్థులు ఈ మార్పును గమనించగలరు.  తరువాత జరగాల్సిన పరీక్షలు యదావిధిగా జరుగుతున్నాయి... దీనికి సంబంధించిన కొత్త టైంటేబుల్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంది... టైంటేబుల్ కావాల్సిన వారు పై లింకును ‌క్లిక్ చేయండి....

కేయూ డిగ్రీ పరీక్షలు టైంటేబుల్

కేయూ డిగ్రీ పరీక్షలు రెండవ సారి వాయిదా అనంతరం ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి... దీనికి సంబంధించిన కకొత్త టైంటేబుల్‌ను యూనివర్సిటీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది... టైంటేబుల్ కావాల్సిన వారు పై లింకును ‌క్లిక్ చేయండి

Tuesday, 18 October 2016

నమ్మి మోసపోకు మిత్రమా....

జీవితంలో ఒకరిని నమ్మి మోసపోయాను అని నీ నోటి నుంచి ఎప్పటికీ రానీయకు మిత్రమా... ఎందుకంటే అతను మోసం చేయడం తప్పు కాదు... నీవు తనను నమ్మడం తప్పు కాదు... తన మోసం(నమ్మించి మోసం చేయడం) చేస్తాడని గ్రహించక మోసపోవడం నీ తప్పు... మోసం చేసాడంటే అది అతని తప్పు 100శాతం కాదు... తనను నమ్మి మోసపోవడం నీ తప్పు... గుర్తుంచుకోండి మిత్రమా ఎవరిని ఎక్కువగా నమ్మకండి... నమ్మి వారిపై ఆశలు పెట్టుకుని వేచిచూస్తూ వారు చేసిన మోసాని బలికాకండి ఇది నా స్వియ అనుభవం...

నమ్మి మోసపోకు మిత్రమా....

జీవితంలో ఒకరిని నమ్మి మోసపోయాను అని నీ నోటి నుంచి ఎప్పటికీ రానీయకు మిత్రమా... ఎందుకంటే అతను మోసం చేయడం తప్పు కాదు... నీవు తనను నమ్మడం తప్పు కాదు... తన మోసం(నమ్మించి మోసం చేయడం) చేస్తాడని గ్రహించక మోసపోవడం నీ తప్పు... మోసం చేసాడంటే అది అతని తప్పు 100శాతం కాదు... తనను నమ్మి మోసపోవడం నీ తప్పు... గుర్తుంచుకోండి మిత్రమా ఎవరిని ఎక్కువగా నమ్మకండి... నమ్మి వారిపై ఆశలు పెట్టుకుని వేచిచూస్తూ వారు చేసిన మోసాని బలికాకండి ఇది నా స్వియ అనుభవం...

Monday, 17 October 2016

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం....

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ప్రమాదంలో సుమారు 30 మంది మరణించగా... 65మందికి పైగా గాయాలపాలయ్యారు.... పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో రెండు ప్యాసింజర్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది... కరాచీ నుంచి బాహల్పూర్ కు వెళుతున్న బస్సు, ఫైసలాబాద్ నుంచి సాదిఖాబాద్ కు వెళుతున్న మరో బస్సు ఎదురెదురుగా ఢీ కొన్నాయి... మరణించిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిపారు స్థానిక పోలీస్ అధికారి... సహాక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాథాలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి...

Sunday, 16 October 2016

వానణాసిలో 24 మంది మృతి... 50మందికి గాయాలు... విచారణ ప్రారంభం....

శనివారం రోజు గంగా నది తీరాన జరిగిన ఘటనపై విచారణ ప్రారంభమైంది. బాధ్యులైన ఆరుగులు పోలీసులను సస్పెండ్ చేసింది ప్రభుత్వం . వారణాసిలోని రాజ్‌ఘాట్‌ వంతనపై శనివారం జరిగిన తొక్కిసలాటలో 24మంది చనిపోయారు. చిన్న పుకారు అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనలో 50మందికి గాయాలయ్యాయి.  జైగురుదేవ్ ఆశ్రమంలో నిర్వహించిన శిబిరానికి  భారీగా ప్రజలు హాజరు కావడంతో దుర్ఘటన జరిగింది. సుమారు మూడు వేల మందికి అనుమతి ఉన్నా... ఎక్కువ సంఖ్యలో ఆశ్రమానికి తరలి వచ్చారు. దీంతో... అనేక మందిని పోలీసులు వెనక్కి పంపించేశారు. అయితే... వంతెన ముందు భాగం కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో... జనాలు పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది.

Saturday, 15 October 2016

బార్డర్‌లో భద్రత కట్టుదిట్టం చేసిన ఆర్మీ…!!!!

శుక్రవారం రాత్రి జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసినట్టే ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో నియంత్రణ రేఖ వెంబడి… కాశ్మీర్‌ లోయ వ్యాప్తంగానూ భద్రత కట్టుదిట్టం చేశారు. హంద్వారా, పాంపోర్‌ దాడులు విఫలమవడం.., ఈడీఐ భవనంపై దాడితో భారత్‌కు జరిగిన నష్టం పెద్దగా లేకపోవడంతో ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. సున్నిమైన ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవడంతో ఉగ్రవాదులు జవాన్‌ కాన్వాయ్‌లను లక్ష్యంగా పెట్టుకున్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.
శుక్రవారం రాత్రి శ్రీనగర్‌ శివార్లలోని జకూరా ప్రాంతంలో జవాన్ల కాన్వాయ్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడిలో మృతి చెందిన జవాను ఘనశ్యామ్‌ గుజ్జార్‌కు ఆర్మీ లాంఛనాల ప్రకారం ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. విజయ్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని దాసా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి చేసి పరారయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. మరో వైపు పాక్‌ పత్రికలు అసలు సర్జికల్‌ దాడులే జరగలేదనే విధంగా వార్తలు వండి వార్చుతున్నాయి. పాక్‌ విదేశాంగ కార్యదర్శి జర్మనీ రాయబారితో సర్జికల్‌ స్ట్రయిక్స్‌ జరగలేదని చెప్పినట్టుగా ద న్యూస్‌ ఇంటర్నేషనల్‌ అనే పత్రికలో కథనం వచ్చింది. ఆ వార్త నిజం కాదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఖండించారు.

రేషనింగ్‌ ఆఫీస్‌ వద్ద టీడీపీ నాయకుల ఆందోళన

తొలగించిన రేషన్ కార్డులను పునరుద్ధరించాలంటూ ఆందోళనకు దిగింది టీ టీడీపీ. బేగంపేటలో ఉన్న చీఫ్‌ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయాన్ని ముట్టడించారు గ్రేటర్ టీడీపీ నాయకులు. ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్డులు పునరుద్ధరించకపోతే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని, అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు నేతలు. రేషన్ కార్డులు తొలగించి పేదల కడుపుకొట్టడం సరికాదన్నారు.

మన సైనికులు మాన‌వ‌త్వానికి ప్రతీక‌లు…

దేశం కోసం జవాన్లు ప్రాణత్యాగం చేస్తున్నారు… మన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అమ‌ర‌వీరుల స్మార‌క స్తూపాన్ని ప్రారంభించిన ప్రధాని… జవాన్ల త్యాగాలను కొనియాడారు. సైనికుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ల దుస్తులు, సాహ‌సం గురించి మాట్లాడుకుంటాం… వాళ్లను మాన‌వ‌త్వానికి ప్రతీక‌లుగా కూడా గుర్తించాల‌న్నారు ప్రధాని.

మనదేశం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ… క్రమశిక్షణ, వ్యవహారశైలిలోనూ మన ఆర్మీకి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి దళంలో భారత్‌ సుదీర్ఘంగా సేవలందిస్తోందని తెలిపారు. ప్రకృతి విప‌త్తు స‌మ‌యాల్లోనూ మ‌న ఆర్మీ మాన‌వ‌త్వాన్ని చాటింద‌న్నారు. యెమెన్‌లో చిక్కుకున్న 5 వేల మంది భారతీయులను కాపాడిన సమయంలో కొంతమంది పాకిస్తాన్‌ వాసులను కూడా మన సైన్యం రక్షించిందని గుర్తుచేశారు మోదీ.

ఫామ్‌హౌజ్ వదిలి… పంట పొలాలకు రండి…

సీఎం కేసీఆర్‌పై ఫైరయ్యారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఫామ్‌హౌజ్ వదిలి… పంట క్షేత్రాలకు వస్తే… రైతుల సమస్యలు ప్రత్యక్షంగా అర్థమవుతాయని సీఎం కేసీఆర్‌కు సూచించారు. నకిలీ విత్తనాల అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తుంటే… ప్రతిపక్షాలపైనే అసత్యపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. అన్నదాత ఆక్రందన పేరిట జమలాపురం నుంచి ఖమ్మం వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు 70 కిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు. బ్రాందీవాదులెవరో, గాంధీవాదులెవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ కాంగ్రెస్ నేతలపై మంత్రి పోచారం చేసిన కామెంట్లపై మండిపడ్డారు భట్టి విక్రమార్క… బ్రాందీవాదులెవరో ప్రజలందరికీ తెలుసని… మత్తు వదిలించుకుని వస్తేనే రైతుల కష్టాలేంటో తెలుస్తాయని పేర్కొన్నారు.