Translate

Saturday, 15 October 2016

మన సైనికులు మాన‌వ‌త్వానికి ప్రతీక‌లు…

దేశం కోసం జవాన్లు ప్రాణత్యాగం చేస్తున్నారు… మన జవాన్ల త్యాగం వెలకట్టలేనిదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ… మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అమ‌ర‌వీరుల స్మార‌క స్తూపాన్ని ప్రారంభించిన ప్రధాని… జవాన్ల త్యాగాలను కొనియాడారు. సైనికుల గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ల దుస్తులు, సాహ‌సం గురించి మాట్లాడుకుంటాం… వాళ్లను మాన‌వ‌త్వానికి ప్రతీక‌లుగా కూడా గుర్తించాల‌న్నారు ప్రధాని.

మనదేశం ఎప్పుడూ ఇతర దేశాలపై దాడి చేయలేదని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ… క్రమశిక్షణ, వ్యవహారశైలిలోనూ మన ఆర్మీకి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి దళంలో భారత్‌ సుదీర్ఘంగా సేవలందిస్తోందని తెలిపారు. ప్రకృతి విప‌త్తు స‌మ‌యాల్లోనూ మ‌న ఆర్మీ మాన‌వ‌త్వాన్ని చాటింద‌న్నారు. యెమెన్‌లో చిక్కుకున్న 5 వేల మంది భారతీయులను కాపాడిన సమయంలో కొంతమంది పాకిస్తాన్‌ వాసులను కూడా మన సైన్యం రక్షించిందని గుర్తుచేశారు మోదీ.

No comments:

Post a Comment