Translate

Sunday, 6 January 2019

స్త్రీలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా...!


'మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'... ఈ మాట మార్చి 8 కంటే వారం రోజుల ముందు నుంచే వినబడుతోంది. కానీ నాకో డౌట్___ ఇది మాటలకే పరిమితమై పోతుందనేది నాకు అర్ధమవుతోంది. అనేది నా భావన. మిత్రమా మనం శుభాకాంక్షలు చెప్పడం తప్పు అని నేను అనను... కానీ ముందు స్త్రీని గౌరవించడం నేర్చుకుందామని నా ఆవేదన. ముఖ్యంగా.. మహిళా దినోత్సవానికి ముందురోజే సరిగ్గా చెప్పాలంటే రోజు కూడా కాదు గంటల వ్యవధి ముందే.... హైదరాబాద్ మహానగరంలో ఓ నకిలీ బాబా అఘాయిత్యం వెలుగు చూసింది. ఇలా దేశంలో ఎందరో ఎంతమందో... మనకు తెలిసేది ఒకటీ రెండు మాత్రమే... ఇలా మరెన్నో.... ఈ పరిణమాలు అన్నీ గమనిస్తే మనం మహిళలకు గౌరవం ఇస్తున్నట్టేనా..? ఆలోచించండి. నిజానికి మనం ఎటు పోతున్నాం.. మన గమ్యం ఎటు వైపు... గాంధీగారు చెప్పన భారతం రాకపోయినా పర్వాలేదు కానీ... రజాకర్ల రోజులు రాకుంటే చాలు అనేది గుర్తుంచుకోండి. ఆ మాత్రమైనా మనం మన సమాజంలో స్త్రీ జాతిని గౌరవించి కాపాడుకుందాం. వారిని గౌరవించడం అంటే... వారిని తిట్టకుండా.. వారిని ఏమనకుండా ఉండటమో... లేక వారిని సత్కరించడమో కాదు. వారిని రక్షించుకోవడం కూడా మనం కర్తవ్యమే అని అర్థం చేసుకోండి. ఆతరువాత చెప్పుకుందాం ఈ శుభాకాంక్షలు.. నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి. ఇది నా ఆలోచనమాత్రమే. ధన్యవాదాలు..
చరిత్ర స్పృష్టించిన డొనాల్డ్ ట్రంప్
అబ్‌ కీ బార్ ‌ట్రంప్ సర్కార్ హుర్రే హే అంటూ రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల నినాదాలు
హిల్లరీ చాలా కష్టపడింది -ట్రంప్
అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికీ నేను అధ్యక్షుడినే -ట్రంప్
మనమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది -ట్రంప్
హిల్లరీ క్లింటన్ ఫోన్ చేసి నన్ను అభినందించింది -ట్రంప్
అమెరికా ప్రజలందరి కలలను సాకారం చేస్తా -ట్రంప్
అమెరికా ఎప్పుడూ అత్యుత్తమమైనదే కోరుకుంటుంది -ట్రంప్
ఇది ఆరంభం మాత్రమే, అధ్యక్షుడి గురించి మీరు గర్వపడతారు -ట్రంప్

Monday, 23 January 2017

భీమవరం టాకీస్‌ అవంతిక ట్రైలర్‌ను ఆవిష్కరించిన దర్శకుడు వి.వి.వినాయక్‌


ప్రముఖ నిర్మాణ సంస్థ భీమవరం టాకీస్‌ బ్యానర్‌పై శ్రీరాజ్‌ బళ్ళ దర్శకత్వంలో శత చిత్రాలకు చేరువలో ఉన్న ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘అవంతిక’. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ దర్శకరత్న దాసరి నారాయణరావు ఆశీస్సులతో ఆయన నివాసంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా ఇటీవల ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా దర్శకరత్న మాట్లాడుతూ.. ‘తుమ్మలపల్లి రామసత్యనారాయణ నా ఇంటిలో మనిషి. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా నా ఆశీస్సులు తీసుకుంటాడు. సలహాలు అడుగుతుంటాడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా నా చేతుల మీదుగా జరిగింది. టీజర్‌ రిలీజ్‌కు తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్యగారు రావడం, ఆయన ఆశీర్వదించడం, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ చేతుల మీదుగా నా సమక్షంలో చేయాలనుకోవడం నా మీదున్న గౌరవ భావానికి నిదర్శనం. దర్శకుడు శ్రీరాజ్‌ ఈ చిత్రం బాగా తీర్చిదిద్దారని ట్రైలర్‌ చూస్తుంటే అర్ధమవుతుంది. చిత్ర నిర్మాత రామసత్యనారాయణకు, చిత్ర యూనిట్‌కు అభినందనలు. ఈ చిత్రం విజయవంతం కావాలని, భీమవరం టాకీస్‌ వంద చిత్రాలు  పూర్తి చేసి రికార్డు సాధించాలని, విజయవంతమైన చిత్ర నిర్మాణ సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. 
దర్శకుడు వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ.. ‘రామసత్యనారాయణగారు ట్రైలర్‌ రిలీజ్‌కు ఆహ్వానించినపుడు గురువుగారైన దాసరిగారి సమక్షంలో చేయమని కోరాను. ఆయన సమక్షంలో జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించాలి. ప్రముఖ నిర్మాతగా చిన్న బడ్జెట్‌లో సినిమాలు తీస్తూ వరుస విజయాలు సాధిస్తున్న రామసత్యనారాయణ మరిన్ని మంచి చిత్రాలు తీసి ఎన్నో విజయాలు సాధించాలి. ఎక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించి మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘అవంతిక’ చిత్రం షూటింగ్‌ మా గురువుగారైన దాసరి చేతుల మీదుగా ఇక్కడే ప్రారంభించాము. సినిమా, టీజర్‌ను రోశయ్య గారి లాంటి ప్రముఖులు రిలీజ్‌ చేయడం, మరో అగ్రదర్శకుడు వి.వి.వినాయక్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం గురువుగారు బిగ్‌ సీడి రిలీజ్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ళ ఇంతకుముందు రెండు చిత్రాలు చేశారు. ఈ సినిమాను పక్కా స్క్రిప్టుతో అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న అవుట్‌ పుట్‌ను రాబట్టారు. ఈ సినిమా ఆయన కెరీర్‌కో మైలు రాయి అవుతుంది. 'ట్రాఫిక్‌' ఓపినింగ్‌ వి.వి.వినాయక్‌ చేయడం జరిగింది. ట్రాఫిక్ లాంటి మంచి సినిమా చేయడంతో నా మీద గౌరవం పెరిగిందని అపుడు వినాయక్ అన్నారు. ఆయన ఆలా అనడం వల్ల వచ్చిన స్ఫూర్తితోనే ఇన్ని సినిమాలు తీయగలిగాను. ఆ సినిమాతో మా సంస్థకు ఓ ప్రత్యేక మైలేజ్‌ ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రానికి కూడా ఆయనే ట్రైలర్‌ విడుదల చేయడం ఓ శుభసూచకంగా భావిస్తున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు కె.ఆర్‌,ఫణిరాజ్‌, దర్శకుడు శ్రీరాజ్‌ బళ్ళ, ధీరజ అప్పాజీ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కర్ణ, ఎడిటింగ్: సోమేష్, మాటలు: క్రాంతి, సైనా, సంగీతం: రవిరాజ్ బళ్ళ, రీ-రికార్డింగ్: ప్రద్యునన్, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీ రాజ్ బళ్ళ

Wednesday, 9 November 2016

చరిత్ర స్పృష్టించిన డొనాల్డ్ ట్రంప్
అబ్‌ కీ బార్ ‌ట్రంప్ సర్కార్ హుర్రే హే అంటూ రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల నినాదాలు
హిల్లరీ చాలా కష్టపడింది -ట్రంప్
అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికీ నేను అధ్యక్షుడినే -ట్రంప్
మనమంతా ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైంది -ట్రంప్
హిల్లరీ క్లింటన్ ఫోన్ చేసి నన్ను అభినందించింది -ట్రంప్
అమెరికా ప్రజలందరి కలలను సాకారం చేస్తా -ట్రంప్
అమెరికా ఎప్పుడూ అత్యుత్తమమైనదే కోరుకుంటుంది -ట్రంప్
ఇది ఆరంభం మాత్రమే, అధ్యక్షుడి గురించి మీరు గర్వపడతారు -ట్రంప్

Thursday, 20 October 2016

బాణాసంచా గోదాంలో భారీ ప్రమాదం... 8మంది మృతి, సుమారు 10మందికి గాయాలు....


దీపావళి బాణాసంచాల తయారీకి పేరెన్నికగన్న ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి... ఈ ప్రాంతంలో ఎపుడూ ఏదో ఒక అగ్ని ప్రమాదం జరుగుతూనే ఉంటుంది... అలాంటి ప్రమాదాల్లోనే చాలా మంది అశువులు బాసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి... అలాంటిదే ఇపుడు మరో అగ్ని ప్రమాదం జరిగింది... బాణా సంచా గోదామములో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఎనిమిది మంది మరణించగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు... వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాద సమయంలో గోదాంలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

భారీ మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాలు పొగతో కమ్ముకుపోయాయి... అయితే... దీపావళి సమీపిస్తుండడంతో భారీ మొత్తంలో టపాకాయలు తయారు చేసి నిల్వ ఉంచారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు కాలి బూడిదైపోయాయి.



Wednesday, 19 October 2016

నారా వారి ఆస్తులు ఇవేనట...!

గుంటూరులో తన కుటుంబ అస్తులు వివరాలు ప్రకటించారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌... వరుసగా ఎనిమిదో ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించిన లోకేష్‌... దేశంలో ఏ రాజకీయ కుటుంబం కూడా ఆస్తులు ప్రకటించడం లేదన్నారు. చంద్రబాబు మొత్తం ఆస్తులు రూ.3కోట్ల 73లక్షలు ఉన్నట్లు చెప్పారు లోకేష్... చంద్రబాబు నికర ఆస్తులు రూ.6కోట్ల 7లక్షలు కాగా, చంద్రబాబుకు జూబ్లీహిల్స్‌లో 3.68 కోట్ల విలువైన ఇల్లు... రూ. లక్షా 52వేల విలువైన పాత అంబాసిడర్ కారు... చంద్రబాబు ఖాతాలో రూ.3ల‌క్షల 59వేల న‌గ‌దు  ఉండగా... చంద్రబాబు పేరిట బ్యాంకు రుణం రూ. 3కోట్ల 6లక్షలు ఉన్నట్లు చెప్పారు.

నారా భువ‌నేశ్వరి పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాలు... పంజాగుట్టలో 73.33కోట్ల విలువైన భవనం... చెన్నైలో 1.86 లక్షల విలువైన గోడౌన్, హైదరాబాద్ మదీనగూడలో 73.8 లక్షల విలువైన 5ఎకరాల వ్యవసాయ భూమి. హెరిటేజ్ ఫుడ్స్‌లో 19.95 కోట్ల విలువైన పెట్టుబడులు,

వివిధ కంపెనీలలో భువ‌నేశ్వరి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3.28 కోట్లుగా వెల్లడించారు... భువ‌నేశ్వరి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్షలు కాగా..భువనేశ్వరి ఆభరణాల విలువ రూ.కోటి 27 ల‌క్షలుగా ప్రకటించారు. భువనేశ్వరి పేరిట ఓ ఆడీ కారు ఉన్నట్లు దాని విలువ రూ.91 ల‌క్షలు... భువ‌నేశ్వరి పేరిట ఉన్న మొత్తం రూ.38కోట్ల 66ల‌క్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు లోకేష్... భువనేశ్వరి పేరిట రూ.13 కోట్ల అప్పుఉన్నట్లు తెలిపిన లోకేష్‌... నిక‌ర ఆస్తులు రూ24 కోట్ల 84 ల‌క్షలుగా చెప్పారు.

నారా లోకేశ్‌ ఆస్తుల వివ‌రాలు... నారాలోకేష్ మొత్తం ఆస్తులు 14.50కోట్లు కాగా... అప్పులు 6.35 కోట్లు ఉన్నట్లు తెలిపారు, లోకేష్‌ నికర ఆస్తుల విలువ 8.15కోట్లు చెప్పారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్ వాటాల విలువ రూ.2 కోట్ల 52 ల‌క్షలు... ఇత‌ర కంపెనీల్లోని వాటాల విలువ రూ.కోటి 64 ల‌క్షలగా చెప్పిన లోకేష్‌... నారా లోకేశ్ పేరిట ఉన్న కారు విలువ రూ.92 లక్షలుగా వెల్లడించారు.

నారా బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.12 కోట్ల 75 ల‌క్షలుగా ప్రకటించారు... రూ.42 ల‌క్షల అప్పులు  ఉండగా బ్రహ్మణి నిఖర ఆస్తుల విలువ రూ.12 కోట్ల 33ల‌క్షలుగా చెప్పారు లోకేష్‌... మాదాపూర్‌లో బ్రాహ్మణి పేరిట రూ.17 ల‌క్షల విలువైన భూమి ఉన్నట్లు తెలిపారు... జూబ్లిహిల్స్‌లో ఇంటి విలువ రూ.3 కోట్ల 50ల‌క్షలు... హైద‌రాబాద్‌లో రూ.48 ల‌క్షలు విలువైన స్థలం... మ‌ణికొండ‌లో రూ.కోటి 23 ల‌క్షల విలువైన స్థలం ఉన్నట్లు వెల్లడించారు... హెరిటేజ్ ఫుడ్స్‌లో బ్రహ్మణి వాటాల విలువ రూ.78 ల‌క్షలు ఉన్నట్లు వెల్లడించారు.. అయితే బ్రహ్మణి ఆభరణాల విలువ రూ.15 ల‌క్షలు కాగా, తన పీఎఫ్ ఖాతా విలువ రూ.19ల‌క్షలుగా వెల్లడించారు లోకేష్‌... ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.25 ల‌క్షలు

లోకేష్‌ తన కొడుకు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల వివరాలను కూడా ప్రకటించారు.... దేవాన్ష్ పేరిట జూబ్లిహిల్స్‌లోని రూ. 9 కోట్ల 17 ల‌క్షల విలువైన ఇంటి స్థలం.. రూ.2 కోట్ల 4ల‌క్షల పిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు... దేవాన్ష్ ఖాతాలోని న‌గ‌దు నిల్వ రూ.2 ల‌క్షల 31 వేలు కాగా, దేవాన్ష్ పేరిట ఉన్న మొత్తం రూ.11 కోట్ల 32 ల‌క్షలు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ

http://14.139.82.55/exambranch/TimeTables10162301.pdf

ఓయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు... 15, 17, 18 తేదీలలో జరగవలసినవి వాయిదా పడిన విషం విధితమే... ఆ వాయిదా పడిన పరీక్షలు 15న జరగాల్సిన పరీక్ష నవంబర్ 12న, నవంబర్ 17న జరగాల్సింది 19న, 18న జరగాల్సింది నవంబర్ 21న జరగనున్నాయి దయచేసి ఉస్మానియా పరిధిలో గల కళాశాలల విద్యార్థులు ఈ మార్పును గమనించగలరు.  తరువాత జరగాల్సిన పరీక్షలు యదావిధిగా జరుగుతున్నాయి... దీనికి సంబంధించిన కొత్త టైంటేబుల్‌ను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంది... టైంటేబుల్ కావాల్సిన వారు పై లింకును ‌క్లిక్ చేయండి....